Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Wednesday, December 26, 2012

Bible enduku chadavaali (2)

ఈమనిలోని యెహోవా ఈరే ప్రార్థనా మందిరములో నవంబర్ 25న 2012వ సంవత్సరం ఆదివారం ఆరాధనలో చెప్పిన వాక్యం యొక్క క్లుప్త సందేశం.
మీ ప్రార్థనా అవసరతలకై మాకు మెయిల్ చెయ్యండి rajesh.jnsm@gmail.com phone:7416474960,Rajesh

Bible enduku chadavaali ? (1)

ఈమనిలోని యెహోవా ఈరే ప్రార్థనా మందిరములో నవంబర్ 18న 2012వ సంవత్సరం ఆదివారం ఆరాధనలో చెప్పిన వాక్యం యొక్క క్లుప్త సందేశం.
మీ ప్రార్థనా అవసరతలకై మాకు మెయిల్ చెయ్యండి rajesh.jnsm@gmail.com phone:7416474960,Rajesh

Prarthana Lakshanamulu

ఈమనిలోని యెహోవా ఈరే ప్రార్థనా మందిరములో నవంబర్ 11న 2012వ సంవత్సరం ఆదివారం ఆరాధనలో చెప్పిన వాక్యం యొక్క క్లుప్త సందేశం.
మీ ప్రార్థనా అవసరతలకై మాకు మెయిల్ చెయ్యండి rajesh.jnsm@gmail.com phone:7416474960,Rajesh

Thursday, November 29, 2012

Devuni Mahima

Add caption

ఈమనిలోని యెహోవా ఈరే ప్రార్థనా మందిరములో నవంబర్ 4న 2012వ సంవత్సరం ఆదివారం ఆరాధనలో చెప్పిన వాక్యం యొక్క క్లుప్త సందేశం.
మీ ప్రార్థనా అవసరతలకై మాకు మెయిల్ చెయ్యండి rajesh.jnsm@gmail.com phone:7416474960,Rajesh

Stuti

Add caption

ఈమనిలోని యెహోవా ఈరే ప్రార్థనా మందిరములో అక్టోబరు 28న 2012వ సంవత్సరం ఆదివారం ఆరాధనలో చెప్పిన వాక్యం యొక్క క్లుప్త సందేశం.
మీ ప్రార్థనా అవసరతలకై మాకు మెయిల్ చెయ్యండి rajesh.jnsm@gmail.com phone:7416474960,Rajesh

Devuni Rekkala Needa

ఈమనిలోని యెహోవా ఈరే ప్రార్థనా మందిరములో అక్టోబరు 22న 2012వ సంవత్సరం ఆదివారం ఆరాధనలో చెప్పిన వాక్యం యొక్క క్లుప్త సందేశం.
మీ ప్రార్థనా అవసరతలకై మాకు మెయిల్ చెయ్యండి rajesh.jnsm@gmail.com phone:7416474960,Rajesh

Monday, August 27, 2012

Naa Kaapari

S.Rajesh 

 ప్రభువు నందు  ప్రియమైన స్నేహితులారా ! మీకు శుభములు తెలుపుచున్నాను. మీరు ఇది చదువుతున్నారంటే మీరు దేవుని కృపలో  ఉన్నారని అర్థం.ఎందుకంటే దేవుని కృప లేనిదే మనమేమి చేయలేము.అసలు దేవుడంటే ఎవరు? కొందరు అనేకమంది దేవుళ్ళు ఉన్నారని అంటారు.కొందరు ఒక్కడే దేవుడంటారు.ఈ మధ్య నేను రైల్లో ప్రయాణం చేస్తుండగా నా ప్రక్కనే ఇరువురు క్రైస్తవులు కూర్చొని దేవుని గురించి మాట్లుకుంటున్నారు .నాకు మరొక వైపు కూర్చున్న ఒక స్త్రీ వారి సంభాషణను ఆలకిస్తూ మధ్యలో కలుగ చేసుకుని,దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడంటూ వేదాంతాన్ని వల్లించబోయే సరికే వారు ఆమెకేమి తెలియదనట్లు మాట్లాడారు.ఆ క్షణం నాలో అనేక ప్రశ్నలు ఒక్క సారిగా మెదిలాయి.వాటిలో ముఖ్యమైనది "ప్రతి వ్యక్తిలో దేవుడుంటే అసలు లోకంలో వారంతా ఇంత స్వార్దంగా ఎలా ఉన్నారు"అనేది.అసలు  ఆమెలో దేవుడుంటే తన కంటే పెద్దవారు ప్రక్కనే నిలబడి ఉన్నారు ఆమె సీటు వారికివ్వచ్చు కదా.అనుకున్నాను.మరి కొందరు దేవుడు లేడు అంటున్నారు బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది  "దేవుడు లేడని బుద్దిహీనులు తమ హృదయంలో అనుకుంటారు"అసలు మనం బైబిల్ నే ఎందుకు నమ్మాలి? ఎందుకంటే బైబిల్ మత గ్రంథం కాదు.బైబిల్ ఒక చారిత్రక గంథం.ప్రపంచ దేశాలు వాటి పేర్లు చారిత్రక సంఘటనలు మనం బైబిల్ లో చూడవచ్చు.అంతే  కాకుండా బైబిల్ లోని అంశాలకు ఋజువులు కూడా నేటికీ ఈ భూమి మీద మనకు కనబడుతున్నై.దీనికి సంబంధించి తరువాతి అంశాల్లో మనం చూడవచ్చు.దీన్ని బట్టి బైబిల్ కల్పిత కథల పుస్తకం కాదు అని మనకు అర్థం అవుతుంది .ఇక నేటి అంశంలోనికొద్దాం. ..

    23వ కీర్తనలో ఈ విధంగా  ఉంది "యెహోవా నా కాపరి  నాకు లేమి కలుగదు."   యెహోవా మనకు కాపరిగా ఉంటే  ఎందుకు మనకు లేమి(కొదువ) కలుగదు?క్రింద దీనికి గల కారణాన్ని మనం చూడవచ్చు.2.పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యెద్ద నన్ను నడిపించుచున్నాడు.3.నా ప్రాణమునకు  సేదదీర్చుచున్నాడు..తన నామమును బట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.4.గాడాం  ధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను..నీవు నాకు తోడైయున్డువు నీ దుడ్డుకర్రయు  నీ దండమును నన్ను ఆదరించును.5.నా శత్రువుల ఎదుట  నీవు నాకు  భోజనము సిద్దపరచుడువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.6.నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము  యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.దేవుడు మనకు కాపరిగా ఉంటె  మనకు మేలు కలుగుతుందని మనకు అర్థమవుతుంది.
 
    దేవుడు ఎటువంటి కాపరి? యోహాను సువార్త 10:11లో "నేను గొర్రెలకు మంచి కాపరిని;మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును." యేసు తానే స్వయంగా చెబుతున్నాడు మంచి కాపరినని.ఎందుకంటే యేసు సిలువలో మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కనుక ఆయన మంచి కాపరి.అటువంటి దేవుడు మనకు కాపరిగా ఉండాలంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి.అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు.కీర్తన 34:7 "యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టు ఆయన దూత కావలి  యుండి వారిని రక్షించును."ఆయన యందు భయభక్తులంటే ఎలా ఉండాలి? కీర్తన 25:8 "యెహోవా ఉత్తముడును యథార్తవంతుడునైయున్నాడు.కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేసిమ్చును." ఆయన యొద్దకు వస్తే పాపులు కూడా పవిత్రులుగా మారి ఆయన మార్గములో ఎలా జీవించాలో ఆయన తెలియజేస్తాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది.ఆయన యొద్దకు వచ్చి ఏమి చేయాలి? కీర్తన 119:68 "నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడాలను నాకు బోధించుము"కీర్తనాకారుడు ప్రార్థించిన  విధంగా మనం కూడా ప్రతి రోజు దేవుణ్ణి వేడుకోవాలి.వేడుకోవటం మాత్రమే కాదు,ఆయన అనుగ్రహించిన కృపను బట్టి  ఆయనకు కృతగ్నతా స్తుతులు చెల్లించాలి.కీర్తన 136:1 " యెహోవా దయాళుడు ఆయనకు కృతగ్నతా స్తుతులు చెల్లించుడి.ఆయన కృప  నిరంతరముండును."ఆయనను ఎందుకు కాపరిగా కలిగి ఉండాలంటే నహూము 1:7 ప్రకారం "యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక యుంచు వారని ఆయన ఎరుగును." మనకు శ్రమ కలిగినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అలా ఉండాలంటే మనము ఆయన యందు నమ్మకముంచాలి.దావీదు ఎప్పుడైతే దేవుని యందు నమ్మకముంచాడో, యెహోవాను దేవుడుగా కలిగి  ఉన్నాడో అప్పుడు సింహమును,ఎలుగుబంటిని ఎదిరించగలిగాడు.1సమూయేలు 17:34,35 "అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను-మీ దాసుడనైన నేను  నా తండ్రి యొక్క గొర్రెలను, కాయుచుండ సింహమును ఎలుగుబంటియును  వచ్చి మందలోనుండి  ఒక గొర్రెపిల్లను ఎత్తికోనిపోవుచుండగా,35నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విదిపించితిని;అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని." ఆయన కాపరిగా ఉంటె, మనలను కాపాడటమే కాదు,మనలను పోషించే దేవుడై  యున్నాడు. యెషయా 40;11"గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును  తన బాహువుతో గోర్రేపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును.పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును."80వ కీర్తన మొదటి వచనంలో ఆసాపు "మందవలె యోసేపును నడిపించువాడా" అంటున్నాడు.ఆయన పోషించే దేవుడు, నడిపించే దేవుడు.కనుక ఆయనను మనకు కాపరిగా కలిగి ఉండాలి.ఆత్మల కాపరి అయిన యేసు నొద్దకు మనం చేరాలి.1పేతురు 2:25 " మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల క్లాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు." ఈ సందేశం చదువుచున్న నీవు ఇంకా ఆయన వైపు మళ్లక పొతే ఈ క్షణమందే ఆయన సన్నిధిలో చేరి ఆయన వైపు నీ హృదయ త్రిప్పుటకు నిర్ణయించుకో!ఆయన కృప కొరకు కనిపెట్టు,ప్రభుని వేడుకో.ఎందుకంటే ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనదని దావీదు అంటున్నాడు కీర్తన 63:3-5" నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.4.నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు 5.క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది.ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది."ఆయనను జ్ఞాపకం చేసికొన్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు మన ప్రాణము తృప్తి పొందుతుంది.క్రొవ్వు,మెదడు అనగా శారీరక బలం మరియు ఆత్మీయ బలం రెండూ మనకు దేవుడు అనుగ్రహించేవాడై యున్నాడు.అవి మనం పొండుకోవాలంటే దేవుని మనకు కాపరిగా కలిగి ఉండాలి.హెబ్రీ 13:20ప్రకారం ఆయన గొప్ప కాపరియై ఉన్నాడు.సోలోమోను జ్ఞానియై యున్నాడు.సోలోమోను కంటే జ్ఞాని,గోప్పవాడనని యేసు చెప్పుచున్నాడు.లూకా 11:31 "దక్షిణ దేశపు రాణి విమర్శా కాలమున ఈ తరము వారితో కూడా  లేచి వారి మీద నేరస్థాపన చేయును.ఆమె సోలోమోను జ్ఞానము వినుటకు భూమ్యన్తముల నుండి వచ్చెను, ఇదిగో సోలోమోను కంటే గోప్పవాడిక్కడ ఉన్నాడు.అంటే కాదు యేసు దేవాలయము కంటే గొప్పవాడు.మత్తయి 12:6 "దేవాలయము కంటే గొప్పవాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను."ఈ రోజుల్లో అనేకులు ఆరాధించే స్థలానికో లేక కట్టడానికో ప్రాధాన్యత నివ్వటం మనం చూస్తున్నాం.   అంట కంటే ముఖ్యమైన దేవుని మర్చిపోఎవారిగా కొందరుంటున్నారు.కనుక దేవాలయం కంటే గొప్పవాడైన యేసును మనకు కాపరిగా కలిగి ఉందాం .ఆయనను కాపరిగా కలిగి ఉంటె ఆయన మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు.అటువంటి శక్తి మన కాపరియైన యేసుకు కలదు.హెబ్రీ 1:4"ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునైయుండి,తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు,పాపముల విషయములో శుద్దీకరణము తానె చేసి,దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో అంతకంటే శ్రేష్టుడై ఉన్నత లోకమందు మహా మహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను."అంటే కాదు ఆయన ప్రధాన కాపరియై యున్నాడు.1పేతురు 5:4"ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు."వాడబారని కిరీటము పొందాలంటే మనము యేసును మనకు కాపరిగా కలిగి ఉండాలి.అలా ఉండాలంటే మనము దేవుని స్వరాన్ని వినాలి.యోహాను సువార్త 10:2-4"ద్వారమున ప్రవేసించువాడు గొర్రెల కాపరి .3అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును,గొర్రెలు అతని స్వరము వినును,అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును.4.మరియు అతడు తన సొంత గోర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి  ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును" ప్రతి ఒక్కరు దేవుని స్వరాన్ని వినాలని ఆయన కోరుకుంటున్నాడు.అందుకే ఆయన అందరిని పిలిచుచున్నాడు.యోహాను సువార్త 10:16"ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలును నాకు కలవు;వాటిని కూడా నేను తోడుకొని రావలెను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును." ఆయన స్వరాన్ని వినాలంటే ఆయనను ప్రేమించాలి.ప్రేమించటమంటే మాటలలో కాదు యోహాను సువార్త .సశేషం